Telugu Global
Cinema & Entertainment

KGF Chapter 3 - త్వరలోనే సెట్స్ పైకి కేజీఎఫ్-3

Hombale films announced KGF 3 - యష్ హీరోగా కేజీఎఫ్3 రాబోతోంది. ఈ మేరకు హోంబలే ఫిలిమ్స్ పరోక్షంగా ప్రకటన చేసింది.

KGF Chapter 3 - త్వరలోనే సెట్స్ పైకి కేజీఎఫ్-3
X

యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఛాప్టర్-1 దేశవ్యాప్తంగా హిట్టయింది. ఇక ఛాప్టర్-2 అయితే ఏకంగా ప్రభంజనం సృష్టించింది. దీంతో దీనికి మరో సీక్వెల్ కూడా ఉంటుందని అంతా అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఛాప్టర్-2 క్లయిమాక్స్ లోనే సీక్వెల్ పై హింట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఓ ప్రత్యేక వీడియోను కట్ చేయించింది. ఛాప్టర్-1, ఛాప్టర్-2 సినిమాల నుంచి క్లిప్పింగ్స్ తీసుకొని, మాంఛి ఎనర్జీతో వీడియో ఎడిట్ చేశారు. ఈ వీడియో ఎంత బాగుందో, చివర్లో ఇచ్చిన హింట్ అంతకంటే పెద్ద హిట్టయింది. 3 అనే అంకెను ఇలా చూపించి, అలా మాయం చేశారు.

దీంతో కేజీఎఫ్ ఛాప్టర్-3 రావడం ఖాయం అనే విషయం స్పష్టమైంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది లాంటి అంశాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ.. హీరో యష్, ఇప్పటివరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు.

ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది కేజీఎఫ్ ఫ్రాంచైజీ. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పఠాన్ లాంటి సినిమాల సరసన ఈ మూవీ నిలిచింది. ఇప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు కొన్ని పదిలంగా ఉన్నాయి.

First Published:  15 April 2023 10:59 AM GMT
Next Story