Telugu Global
Cinema & Entertainment

HIT 2: ఈ సినిమా కేవలం 2 గంటలు మాత్రమే

HIT 2: అడివి శేష్ హీరోగా నటిస్తున్న హిట్-2 సినిమా రన్ టైమ్ లాక్ అయింది. ఈ సినిమా నిడివి 2 గంటలు మాత్రమే. పైగా సెన్సార్ లో A వచ్చింది.

HIT 2 Movie Trailer hints at a big HIT
X

HIT 2 Movie Trailer hints at a big HIT

డిసెంబర్ 2వ తేదీ ప్రధానంగా 2 సినిమాల మధ్య పోటీ ఉండబోతోంది. అందులో ఒకటి మట్టి కుస్తీ అయితే, రెండోది హిట్-2. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా అదే రోజు థియేటర్లలోకి వస్తోంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది.

A-సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను కేవలం 2 గంటల్లో ముగించబోతున్నారు మేకర్స్. ఈ టైపు థ్రిల్లర్ సినిమాలకు ఇది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. ఎందుకంటే, ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ కేసు చుట్టూ తిరుగుతుంది. ప్రశ్నలు, అనుమానితులు పెరుగుతూనే ఉంటారు. సెకండాఫ్‌కి వస్తే, కథ మొత్తం కేవలం 2 రాత్రుల్లోనే జరుగుతుంది.

హై టెక్నికల్ వాల్యూస్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నాడు నిర్మాత నాని. థ్రిల్లర్ ప్రియులకు మరింత థ్రిల్‌ అందించడానికి, డిసెంబర్ 2న వస్తోంది హిట్-2.

First Published:  27 Nov 2022 10:55 AM GMT
Next Story