Telugu Global
Cinema & Entertainment

హిట్ 2.. షూటింగ్ అప్ డేట్స్

అడివి శేష్ హీరోగా నటిస్తున్న హిట్-2 సినిమా లైమ్ లైట్లో లేకుండా పోయింది. ఇంతకీ ఈ సినిమా స్టేటస్ ఏంటి?

హిట్ 2.. షూటింగ్ అప్ డేట్స్
X

మేజర్‌ సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన అడివి శేష్‌ త్వరలోనే హిట్‌2తో థియేటర్లలోకి రాబోతున్నాడు. జులై 29న విడుదల ఉంటుందని ఇంతకు ముందు ప్రకటించినా ఇప్పటిదాకా ప్రమోషన్సే మొదలు కాలేదు. దీనిపై అడివి శేష్ రియాక్ట్ అయ్యాడు.

''మేజర్‌ రిలీజ్‌ కాగానే హిట్‌2 షూటింగ్‌లో పాల్గొనాలి. ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేయాలి. కానీ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్‌ ని ప్రపంచంలోని నలుమూలలా ఉన్న ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాను. శారీరకంగా, మానసికంగా అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు ఆస్వాదించాను. ఆ విషయాలను నానికి, శైలేష్‌కి వివరించాను. ఫైనల్‌ షెడ్యూల్‌ని అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. చివరి షెడ్యూల్‌ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతాం. హిట్‌2 రిలీజ్‌ గురించి అతి త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేస్తాం''

ఇలా హిట్-2పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు శేష్. ఇందులో కృష్ణదేవ్‌ అనే పాత్ర చేస్తున్నాడు. అందరూ కృష్ణదేవ్‌ని కేడీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కథగానే దీన్ని చూపిస్తారు.

సెకండ్‌ పార్ట్ ఆఫ్‌ హిట్‌ (హొమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌)ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. నాని సమర్పిస్తున్నాడు. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.





First Published:  23 July 2022 1:30 PM GMT
Next Story