Telugu Global
Cinema & Entertainment

HIT2: సిద్ శ్రీరామ్ నుంచి మరో సాంగ్ వచ్చింది

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా హిట్-2. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

HIT2: సిద్ శ్రీరామ్ నుంచి మరో సాంగ్ వచ్చింది
X

అడివి శేష్‌ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'హిట్ 2'. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు

మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ కు జోడీగా న‌టించింది. నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ అంద‌ర్ని ఎట్రాక్ట్ చేసింది. ఈ ఊపును కొనసాగిస్తూ, తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు.

'ఉరికే ఉరికే..' అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను హైద‌రాబాద్‌లో 3 కాలేజీల‌కు చెందిన విద్యార్థుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట, సినిమాకు హైప్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. పాట మరీ అంత గొప్పగా లేకపోయినా, వినడానికి బాగుంది. అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కుదిరింది. విజువ‌ల్స్ బాగున్నాయి.

కూల్ పోలీస్ ఆఫీస‌ర్ కె.డి .. ఆర్య‌పై ఉన్న ప్రేమ‌ను పాట ఎలివేట్ చేస్తుంది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు.

హోమీసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌లో కూల్ కాప్ కె.డిపాత్రలో అడివి శేష్ క‌నిపించ‌బోతున్నాడు. రావు ర‌మేష్‌, కోమ‌లి ప్రసాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను, డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తున్నారు.



First Published:  11 Nov 2022 4:26 AM GMT
Next Story