Telugu Global
Cinema & Entertainment

Hidimba Movie OTT | ఓటీటీలోకి మరో తాజా చిత్రం

Hidimba Movie OTT | త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది హిడింబ మూవీ. గమ్మత్తుగా ఈ మూవీకి స్ట్రీమింగ్ టైమ్ కూడా లాక్ చేశారు.

Hidimba Movie OTT  | ఓటీటీలోకి మరో తాజా చిత్రం
X

Hidimba Movie OTT | ఓటీటీలోకి మరో తాజా చిత్రం

Hidimba Movie OTT | థియేటర్లలో రిలీజైన మినిమం గ్యాప్ లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. మరీ ముఖ్యంగా మూవీ ఫ్లాప్ అయిందంటే చాలా తొందరగా అది ఓటీటీలో ప్రత్యక్షమౌతుంది. మొన్నటికిమొన్న రంగబలి విషయంలో ఇదే జరిగింది. సినిమా రిలీజై నెల రోజులు కూడా దాటకుండానే ఓటీటీలోకి వచ్చేసింది నాగశౌర్య సినిమా. ఇప్పుడు మరో మూవీ వంతు.

అశ్విన్ బాబు, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హిడింబ. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మంచి కథకు సరైన స్క్రీన్ ప్లే రాసుకోకపోవడంతో, సినిమా నిరాశపరిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో హిడింబ ప్రత్యక్షం కానుంది. ఈనెల 10వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆహా.

సాధారణంగా ఓటీటీలో ఓ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టాలనుకున్నప్పుడు అర్థరాత్రి నుంచి అది అందుబాటులోకి వస్తుంది. ఇన్నాళ్లూ ఇలానే జరిగింది. కానీ తొలిసారి, ఆహా మాత్రం స్ట్రీమింగ్ కు కూడా టైమ్ సెట్ చేసింది.

హిడింబ సినిమాను 10వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. ఇది కొత్త ట్రెండ్. ఇకపై మిగతా ఓటీటీలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతాయేమో చూడాలి. డేట్ మాత్రమే కాకుండా, మంచి టైమ్ చూసి మరీ సినిమాల్ని స్ట్రీమింగ్ కు పెడతాయేమో.

First Published:  7 Aug 2023 4:56 AM GMT
Next Story