Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | నాని సినిమా పాటల సందడి

Hi Nanna - పాటలతో సిద్ధమయ్యాడు నాని. త్వరలోనే హాయ్ నాన్న సాంగ్స్ రిలీజ్ కాబోతున్నాయి.

Hi Nanna | నాని సినిమా పాటల సందడి
X

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఈ సినిమాలోని మొదటి పాట సమయమా విడుదల చేసే తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సమయమా పాట సెప్టెంబర్ 16న విడుదల కానుంది. పోస్టర్ లో నాని చిరునవ్వుతో తన చేతులను విప్పి అనందంగా కనిపిస్తున్నారు. పోస్టర్ సూచించినట్లుగా, సమయమా పాట అందమైన, మ్యూజికల్ మెలోడీ.

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఖుషి సినిమాకు ఇతడే మ్యూజిక్ డైరక్టర్.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనుంది. గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలి నాని సినిమాల మాదిరిగానే ‘హాయ్ నాన్న’ పాటలు కచ్చితంగా క్లిక్ అవుతాయనిపిస్తోంది.

'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  14 Sep 2023 5:41 PM GMT
Next Story