Telugu Global
Cinema & Entertainment

Vishal Hari | హ్యాట్రిక్ కు రెడీ అయిన సూపర్ హిట్ జోడీ

Hero Vishal and Director Hari - హీరో విజయ్, దర్శకుడు హరి మరోసారి చేతులు కలిపారు. హ్యాట్రిక్ మూవీకి సిద్ధమౌతున్నారు.

Vishal Hari | హ్యాట్రిక్ కు రెడీ అయిన సూపర్ హిట్ జోడీ
X

'భరణి' 'పూజ' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత హీరో విశాల్, దర్శకుడు హరి మరోసారి కలిశారు. ఈసారి వీళ్లిద్దరూ కలిసి హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈ కాంబినేషన్ ను స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. చెన్నై, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా షూటింగ్ చేస్తారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కెరీర్ లో విశాల్‌కి ఇది 34వ సినిమా.

మొన్నటివరకు మార్క్ ఆంటోనీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు విశాల్. ఆ సినిమా షూటింగ్ ఇలా పూర్తయిన వెంటనే, అలా హరి దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

ఇంట్రస్టింగ్ రేసీ స్క్రీన్ ప్లే తో సినిమాలు తీయడంలో దర్శకుడు హరి స్పెషలిస్ట్. ఇక యాక్షన్‌ ప్యాక్డ్ పాత్రలు చేయడంలో విశాల్‌ స్పెషల్. వీళ్లిద్దరూ కలిస్తే సినిమా కచ్చితంగా హిట్ అనే ఇమేజ్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాల్ సినిమాలకు రెగ్యులర్ గా పనిచేసే, దిలీప్ సుబ్బరాయన్, ఈ సినిమాకు కూడా స్టంట్స్ కంపోజ్ చేయబోతున్నాడు.

First Published:  16 July 2023 3:11 PM GMT
Next Story