Telugu Global
Cinema & Entertainment

Kabzaa Movie: గ్లోబల్ మొత్తం కబ్జా చేస్తామంటున్న ఉపేంద్ర

Hero Upendra Kabzaa Movie - కబ్జా మూవీతో పాన్ గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ కొడతానంటున్నాడు హీరో ఉపేంద్ర. తాజాగా తెలుగు వెర్షన్ ప్రచారం ప్రారంభించాడు.

Kabzaa Movie: గ్లోబల్ మొత్తం కబ్జా చేస్తామంటున్న ఉపేంద్ర
X

ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో.. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దీని కోసం యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చారు. ఈ పాటతో తెలుగులో ప్రమోషన్స్ మొదలయ్యాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర.. కబ్జా సినిమాతో పాన్ ఇండియానే కాకుండా, గ్లోబల్ మొత్తం కబ్జా చేస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు సినిమా ఉందని, కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు.

"కబ్జ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత క‌రోనా కూడా వ‌చ్చింది. అయితే చంద్రు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి భ‌గీర‌థుడిలా క‌బ్జ సినిమాను ఇక్క‌డివ‌ర‌కు తీసుకొచ్చాడు. ఓ టీమ్‌గా అంద‌రినీ క‌లుపుకుంటూ ఓ ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డివ‌ర‌కు చంద్రు వ‌చ్చాడు. శ్రియా ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి స్టార్స్‌తో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నాం"

ఇలా కబ్జా సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు ఉపేంద్ర. మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూల్ సంగీతం అందించాడు.

First Published:  7 Feb 2023 3:57 AM GMT
Next Story