Telugu Global
Cinema & Entertainment

Vaarasudu: ఎమోషన్స్ ఉంటాయి, విలన్స్ ఉండరు

Vaarasudu Movie: విజయ్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ ఏమంటున్నాడంటే?

Vaarasudu: ఎమోషన్స్ ఉంటాయి, విలన్స్ ఉండరు
X

విజయ్ హీరోగా నటించిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ వారసుడు. ఇది యాక్షన్ సినిమా కాదంటున్నాడు శ్రీకాంత్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈ సీనియర్ నటుడు, వారసుడులో విలన్లు ఉండరని చెబుతున్నాడు.

"నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్ గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. 'వారసుడు' అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ ఉంటాయి. విలన్లు ఉండరు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే ఉంటుంది. రష్మిక, జయసుధ, నేను, కిక్ శ్యామ్ , శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే ఉండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలానే అనిపిస్తుంది."

ఇలా వారసుడు సినిమా స్టోరీపై క్లారిటీ ఇచ్చాడు శ్రీకాంత్. విజయ్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా రోజులైందని, ఆ లోటును వారసుడు సినిమా భర్తీ చేస్తుందని చెబుతున్నాడు.

ఇన్నాళ్లూ తెలుగులో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన శ్రీకాంత్.. వారసుడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరిసుగా తమిళ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ క్లిక్ అయితే, కోలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాలని అనుకుంటున్నాడు.




First Published:  4 Jan 2023 4:19 AM GMT
Next Story