Telugu Global
Cinema & Entertainment

Raj Tarun: కొత్త సినిమా లాంఛ్ చేసిన రాజ్ తరుణ్

Raj Tarun - హిట్ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్ తరుణ్. ఇందులో భాగంగా మరో కొత్త కాంబినేషన్ కి తెర లేపాడు.

Raj Tarun: కొత్త సినిమా లాంఛ్ చేసిన రాజ్ తరుణ్
X

ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులముందుకొచ్చిన రాజ్ తరుణ్, ఇప్పుడు కొత్త సినిమా లాంఛ్ చేశాడు. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ చిత్రాల దర్శకుడు రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సురక్ష ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైంది. నిర్మాత మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. మరో నిర్మాత కెఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇంకో నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్ ను దర్శకుడు రవికుమార్ చౌదరికి అందించారు.


ఈ సినిమాకు డిఫరెంట్ పేరు పెట్టారు. 'తిరగబడర సామి' అనేది ఈ సినిమా టైటిల్. టైటిల్ ఎలా ఉన్నప్పటికీ, సినిమాలో కామెడీ గ్యారెంటీ అంటున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.


జె.బి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తాడు. ఈ నెల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  1 Dec 2022 1:10 PM GMT
Next Story