Telugu Global
Cinema & Entertainment

మాస్ సాంగ్‌తో `ద‌స‌రా` ధ‌మాకా.. - తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన నాని

ఇంత‌వ‌ర‌కూ ప్రేక్ష‌కులు చూడ‌ని ప‌క్కా మాస్ లుక్‌లో నాని ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. నాని ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రూపొందించిన క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టాడు.

మాస్ సాంగ్‌తో `ద‌స‌రా` ధ‌మాకా.. - తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన నాని
X

నేచుర‌ల్ స్టార్ నాని ప‌క్కా మాస్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో వ‌స్తున్న తాజా మూవీ `ద‌స‌రా`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రం మాస్ ధ‌మాకా సాంగ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చింది ఈ చిత్ర బృందం. ధూమ్ ధామ్ దోస్తాన్.. అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఊర మాస్ లెవల్‌లో ఉంది. ఇందులో నాని ఊర మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ప‌క్కా తెలంగాణ మాస్ స్లాంగ్‌లో ఈ పాట ఉంది. సిల్క్ బార్ కేంద్రంగా ఈ పాట రూపొందించారు. తెలంగాణ ఫోక్ ఫార్మాట్‌లో కాస‌ర్ల శ్యామ్ ఈ పాట రాశాడు.

ఇంత‌వ‌ర‌కూ ప్రేక్ష‌కులు చూడ‌ని ప‌క్కా మాస్ లుక్‌లో నాని ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. నాని ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రూపొందించిన క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టాడు. తొలిపాట క్లిప్‌లో ఈ విష‌యం స్ప‌ష్టంగా వెల్ల‌డ‌వుతోంది. బొగ్గు గ‌ని కార్మికుడిగా ఈ చిత్రంలో నాని న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలుస్తోంది.

సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని, సాయికుమార్‌, జ‌రీనా వాహ‌బ్ వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం 2023 మార్చి 30న రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

First Published:  5 Oct 2022 3:48 AM GMT
Next Story