Telugu Global
Cinema & Entertainment

Nani30: తన ప్రపంచాన్ని పరిచయం చేసిన నాని

Hero Nani: తన 30వ సినిమాకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఒకేసారి బయటపెట్టాడు హీరో నాని. ఈ మేరకు అతడు రిలీజ్ చేసిన ఓ వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

Nani30: తన ప్రపంచాన్ని పరిచయం చేసిన నాని
X

నాని తన 30వ సినిమా కోసం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని 2 రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించనున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన కుమార్తెతో చర్చిస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియోలో చూపించారు.

'దసరా' చిత్రానికి పెంచిన మీసాలతో పాటు గడ్డం కూడా షేవ్ చేస్తానని అంటున్నాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, తండ్రీకూతుళ్ల బాండింగ్ ప్రధాన ఆకర్షణ అని ఈ వీడియో చూస్తే అర్ధమౌతోంది.

ఈ గ్లింప్స్ తో దర్శకుడితో సహా చిత్రానికి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. శౌర్యువ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. ఖుషి సినిమాకు సంగీతం అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.



First Published:  1 Jan 2023 1:05 PM GMT
Next Story