Telugu Global
Cinema & Entertainment

గీత.. ఈ నెలలోనే వస్తోంది

హెబ్బా పటేల్ లీడ్ రోల్ పోషించిన సినిమా గీత. ఈ సినిమా 26న థియేటర్లలోకి వస్తోంది.

గీత.. ఈ నెలలోనే వస్తోంది
X

వీవీ వినాయక్ శిష్యుల నుంచి మరో వ్యక్తి దర్శకుడిగా మారాడు. అతడి పేరు విశ్వ. "గ్రాండ్ మూవీస్" బ్యానర్ పై ఆర్.రాచయ్య నిర్మించిన సినిమా "గీత". ఈ సినిమాతో వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.

సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. ఇదొక డిఫరెంట్ స్టోరీ. హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించాడు. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి చిత్రాల్లో హీరోగా నటించి, సాఫ్ట్ గా కనిపించిన సాయి కిరణ్ ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

రామ్ కార్తీక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, 30 ఇయర్స్ పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో హెబ్బా పటేల్ డీ-గ్లామరైజ్డ్ పాత్ర పోషించింది. అంతేకాదు, తన కెరీర్ లో హెబ్బా పోషించిన విలక్షణ పాత్ర కూడా ఇదే. ఇందులో ఆమె మూగ అమ్మాయిగా కనిపించనుంది.

ఈ సినిమాలో పాటలకు సాగర్ సాహిత్యం సమకూర్చగా.. సుభాష్ ఆనంద్ సంగీతం అందించాడు. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. 26న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా అటు దర్శకుడు విశ్వకు, ఇటు హీరోయిన్ హెబ్బా పటేల్ కు కీలకంగా మారింది.





First Published:  15 Aug 2022 8:29 AM GMT
Next Story