Telugu Global
Cinema & Entertainment

Sasanasabha Movie: తెరవెనక మంగ్లీ, తెరపై హెబ్బా

Nannu Pattukunte Telugu Song: మంగ్లి అదరగొట్టింది, హెబ్బా మెరుపులు మెరిపించింది. శాసనసభ మూవీ లో ఐటెం సాంగ్ అదిరింది

Sasanasabha Movie: తెరవెనక మంగ్లీ, తెరపై హెబ్బా
X

Sasanasabha Movie: తెరవెనక మంగ్లీ, తెరపై హెబ్బా

మంగ్లీ పాట పాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి కిక్కిచ్చే పాటకు తెరపై హెబ్బా పటేల్ అందాలు ఆరబోస్తే ఎలా ఉంటుందో ఇకపై చూడబోతున్నాం. అవును.. మంగ్లీ-హెబ్బా కలిశారు. సిల్వర్ స్క్రీన్ ను రఫ్ఫాడించబోతున్నారు.


కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవి బస్రూర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవి బస్రూర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ.


ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.


కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు. హెబ్బా పటేల్ ఈ సాంగ్ లో డాన్స్ చేయగా, మంగ్లీ ఆలపించింది. పాట అదిరిపోయింది. కైపెక్కించే సాహిత్యానికి మంగ్లీ వాయిస్ సరిగ్గా సెట్ అయింది. ఈ పాటకు హెబ్బా పటేల్ చేసిన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లిరికల్ వీడియోలో హుక్ స్టెప్ ను మాత్రమే విడుదల చేశారు.


వచ్చే నెలలో శాసన సభ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.



First Published:  14 Nov 2022 10:05 AM GMT
Next Story