Telugu Global
Cinema & Entertainment

హత్య మూవీ ట్రయిలర్ రివ్యూ

విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ హత్య. ఈ సినిమా ట్రయిలర్ ను నాని రిలీజ్ చేశాడు. ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం

హత్య మూవీ ట్రయిలర్ రివ్యూ
X

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు, నిశ్శబ్ధం చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రయిలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. లైలా అనే ఔత్సాహిక మోడల్, కాబోయే హీరోయిన్ హత్యకు గురవుతుంది. ఆమె కేసును వారం రోజుల్లో కొలిక్కి తీసుకొచ్చే బాధ్యత డిటెక్టివ్ అయిన హీరోపై పడుతుంది. ఎలాంటి ఆధారా ల్లేని ఈ కేసును హీరో ఎలా చేధించాడనేది ఈ సినిమా స్టోరీ.

ట్రయిలర్ లో హీరో విజయ్ ఆంటోనీ, హీరోయిన్ రితిక సింగ్ తో పాటు.. కీలక పాత్రధారులైన రాధిక, మురళీశర్మ, మీనాక్షి చౌదరి లాంటి పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. ట్రయిలర్ హాలీవుడ్ రేంజ్ లో రిచ్ గా ఉంది.

ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్,

ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.



Next Story