Telugu Global
Cinema & Entertainment

Harom Hara | హరోం హర టైటిల్ ట్రాక్ అదిరింది

Harom Hara - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోంహర. ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజైంది.

Harom Hara | హరోం హర టైటిల్ ట్రాక్ అదిరింది
X

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర విడుదలకు సిద్ధమవుతోంది. సెహరి మూవీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో సుధీర్ బాబును కొత్తగా కనిపిస్తాడట.

ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్- హరోం హరను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ టైటిల్ సాంగ్ ఓ కొత్త అనుభూతినిస్తోంది.

కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. పాటలో సుధీర్ బాబు రెబల్ గా కనిపించాడు. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తున్న మాళవిక శర్మ కూడా ఈ పాటలో కనిపించింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్. సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

First Published:  14 Feb 2024 5:07 PM GMT
Next Story