Telugu Global
Cinema & Entertainment

Hari Hara Veeramallu | బిజినెస్ డీల్ లాక్ చేసిన పవన్ సినిమా?

Hari Hara Veeramallu - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. రెండేళ్లకు పైగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు, ఇప్పుడో డీల్ పూర్తి చేసింది.

Hari Hara Veeramallu | బిజినెస్ డీల్ లాక్ చేసిన పవన్ సినిమా?
X

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి చాన్నాళ్లయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఒక దశలో ఈ సినిమా షూటింగ్ పై అనుమానాలు కూడా తలెత్తాయి. సరిగ్గా అప్పుడే యూనిట్ ప్రకటన ఇచ్చింది. సినిమాకు సంబంధించి వివిధ దేశాల్లో గ్రాఫిక్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే హరిహర వీరమల్లు నుంచి అప్ డేట్ ఇస్తామని తెలిపింది.

ఇదిలా ఉండగా, మరోవైపు ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ క్లోజ్ చేసే పనిలో పడింది యూనిట్. హరిహర వీరమల్లు సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ చిక్కు ఉంది

అమెజాన్ ప్రైమ్ అగ్రిమెంట్ చాలా కఠినంగా ఉంది. చెప్పిన టైమ్ కు వాళ్లకు కంటెంట్ అందించాల్సి ఉంటుంది. ఇటు చూస్తే, పవన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో తెలియదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లీడ్ లాక్ అయినప్పటికీ, నిర్మాతకు ఆనందం లేకుండా పోయింది.

ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికలు సుదీర్ఘంగా సాగనున్నాయి. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాకు వెయిటింగ్ తప్పదు. ఎన్నికల తర్వాత కూడా పవన్ నేరుగా ఇదే సినిమా సెట్స్ పైకి వస్తాడనే గ్యారెంటీ లేదు. అతడి చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

First Published:  19 March 2024 1:29 AM GMT
Next Story