Telugu Global
Cinema & Entertainment

హరిహర వీరమల్లు.. కొత్త పోస్టర్ ఇదే

పవన్ కల్యాణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేపు గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు.. కొత్త పోస్టర్ ఇదే
X

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈరోజు ప్రచార చిత్రంను విడుదల చేశారు.

రథంపై సీరియస్ గా దూసుకుపోతున్న వీరమల్లు లుక్ లో పవన్ కల్యాణ్ ఈ కొత్త పోస్టర్ లో కనిపించాడు. రేపు సాయంత్రం 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ గ్లింప్స్ దాదాపు టీజర్ రేంజ్ లోనే ఉండబోతోంది.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, విజువ‌ల్ ఫీస్ట్‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా తెరకెక్కుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ. భార‌తీయ సినిమా తెరపై ఇప్ప‌టివరకు ఈ కథ చెప్పలేదని, కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభూతిని ఇస్తుందని అంటున్నాడు క్రిష్.

ఇప్పటివరకు 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ 50 శాతం పూర్త‌యింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. పాన్‌-ఇండియా రేంజ్ లో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. సినిమాకు ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వర్క్ చేస్తున్నాడు.





First Published:  1 Sep 2022 12:30 PM GMT
Next Story