Telugu Global
Cinema & Entertainment

Hanuman Movie | త్వరలోనే టికెట్ రేట్ల తగ్గింపు?

HanuMan Movie - ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది హనుమాన్ సినిమా. ఇప్పుడీ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించే యోచనలో యూనిట్ ఉంది.

Hanuman Movie | త్వరలోనే టికెట్ రేట్ల తగ్గింపు?
X

ఇప్పటికే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హనుమాన్ సినిమా. కోటి మందికి పైగా ఈ సినిమాను చూశారు. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఇప్పుడీ సినిమావైపు మరింత మంది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు హనుమాన్ యూనిట్ మరో ప్లాన్ తో ముందుకొచ్చింది.

వచ్చే వారం నుంచి హనుమాన్ సినిమా టికెట్ రేట్లు తగ్గించే యోచనలో ఉంది యూనిట్. ప్రస్తుతం నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో 175 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 295 రూపాయల టికెట్ రేట్లు నడుస్తున్నాయి. వచ్చే వారం నుంచి ఈ రేట్లను తగ్గించే ప్లాన్ చేస్తోంది.

సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలకే హనుమాన్ సినిమాను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది 4వ వారం, 5వ వారం కోసం అనుకున్న ఆఫర్. ఇక 6వ వారం నుంచి ఈ సినిమాను 112 రూపాయలకే అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఉంది.

ఇలా భారీగా టికెట్ రేట్లు తగ్గించి, హనుమాన్ సినిమాను మరింత మందికి చేరువ చేయడంతో పాటు, థియేటర్లలో లాంగ్ రన్ ను కొనసాగించాలని టీమ్ భావిస్తోంది.

First Published:  30 Jan 2024 4:54 PM GMT
Next Story