Telugu Global
Cinema & Entertainment

Hanuman Movie OTT | శివరాత్రి కానుకగా హనుమాన్

Hanuman Movie OTT: హనుమాన్ మూవీ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమైంది. శివరాత్రి నుంచి జీ5లో ఈ మూవీ ప్రత్యక్షంకానుంది.

Hanuman Movie OTT | శివరాత్రి కానుకగా హనుమాన్
X

సంక్రాంతి బరిలో సూపర్ సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా హను-మాన్. టాలీవుడ్ హిస్టరీలోనే సంక్రాంతి బరిలో రిలీజై భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. చిరంజీవి, మహేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి ఎంతోమంది హీరోల సినిమాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయినప్పటికీ.. పెట్టిన పెట్టుబడికి, సాధించిన వసూళ్లకు లెక్కలేసి చూసుకుంటే, సంక్రాంతి సినిమాల్లో హను-మాన్ దే అతి పెద్ద విజయం. తాజా సమాచారం ప్రకారం, పెట్టిన పెట్టుబడికి 8 రెట్లు ఎక్కువగా వసూళ్లు సాధించింది ఈ మూవీ.

అలా సంక్రాంతి ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. జీ5 సంస్థ, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శివరాత్రి కానుకగా స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

నిజానికి సంక్రాంతి సినిమాలన్నీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు ఆల్రెడీ వివిధ ఓటీటీ మాధ్యమాల్లో ఉన్నాయి. ఇన్నాళ్లకు హనుమాన్ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

First Published:  2 March 2024 8:22 AM GMT
Next Story