Telugu Global
Cinema & Entertainment

Hanuman | ఇకపై త్రీడీలో హనుమాన్

Hanuman 3D - థియేటర్లలో సూపర్ హిట్టయిన హనుమాన్ సినిమా త్వరలోనే త్రీడీలో కూడా రానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

Hanuman | ఇకపై త్రీడీలో హనుమాన్
X

బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ హనుమాన్ ఈ ఏడాది చివర్లో థ్రిల్లింగ్ 3D వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలోకి రానుంది. జనవరి 12న విడుదలైన హనుమాన్, తేజ సజ్జ హీరోగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది, ఆల్-టైమ్ సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఏకంగా 300 కోట్ల మార్కును చేరుకోవడంతో పాటు, టాలీవుడ్ టాప్-8 గ్రాసర్‌లలో తన స్థానాన్ని దక్కించుకుంది.

హనుమాన్ 3డి వెర్షన్ త్వరలో విడుదల కానుందని కొన్ని రోజుల క్రితం పుకార్లు వచ్చాయి. అవి నిజమని ఇప్పుడు తేలింది. యుఎస్‌లో ఈ చిత్రం సక్సెస్ టూర్ లో భాగంగా, హను-మాన్ టీమ్ 3డి వెర్షన్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. త్రీడీ వెర్షన్‌లో హనుమాన్ పై తీసిన మరికొన్ని సన్నివేశాలతోపాటు.. కొన్ని కొత్త యాక్షన్ బ్లాక్‌లు కూడా ఉంటాయని బృందం ధృవీకరించింది.

క్లైమాక్స్‌లో హనుమంతుడి ఎపిసోడ్ సినిమాలో హైలైట్ సన్నివేశాల్లో ఒకటి. ఇప్పుడు మేకర్స్ హనుమాన్ ఉన్న మరిన్ని సన్నివేశాల్ని జోడిస్తున్నారు. ఆల్రెడీ హను-మాన్ ను చాలామంది చూసేశారు. త్రీడీ వెర్షన్ ను ఎంతమంది చూస్తారో వేచిచూడాలి.

First Published:  9 Feb 2024 4:44 PM GMT
Next Story