Telugu Global
Cinema & Entertainment

Hanu-Man: విడుదల తేదీ ఫిక్స్

Hanu-Man: తేజ సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ మూవీని పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు

Hanu-Man: విడుదల తేదీ ఫిక్స్
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'హను-మాన్‌'. తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. మెస్మరైజింగ్ విజువల్స్, ఇంటెన్స్ మ్యూజిక్ తో అలరించిన టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని చూపించిన మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలో "రామ్.. రామ్.." అని జపిస్తూ శివలింగం ఎదుట హనుమంతుడు ధ్యానం చేస్తూ ప్రజంట్ చేసిన టీజర్ సూపర్ హిట్టయింది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు తమ దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారు. హను మాన్ అవుట్ పుట్ హాలీవుడ్ స్థాయిలో వచ్చింది. టీజర్‌కి వచ్చిన రిసెప్షన్‌ను చూసి, చిత్ర నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


అవును.. హను మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, సహా పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ లో మే 12, 2023 వేసవిలో పాన్ వరల్డ్‌ రిలీజ్ కాబోతుంది.


అనౌన్స్‌మెంట్ వీడియో మరో టీజర్‌ను చూసిన అనుభూతిని ఇచ్చింది. కాషాయ రంగు మ్యాప్‌, బ్యాక్ గ్రౌండ్ లో శ్రీ ఆంజనేయ స్తోత్రం ఉత్తేజకరమైన సంగీతంతో వినిపిస్తూ హను-మాన్ విడుదలయ్యే దేశాలను చూపించే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వీడియో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది,


ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.



First Published:  10 Jan 2023 5:58 AM GMT
Next Story