Telugu Global
Cinema & Entertainment

Hanu-Man Movie | హను-మాన్ ట్రయిలర్ రెడీ

Hanu-Man Movie - తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా హను-మాన్. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది.

Hanu-Man Movie | హను-మాన్ ట్రయిలర్ రెడీ
X

తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హను-మాన్. ఈ సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో క్లిక్ అయింది హను-మాన్ టీజర్. ఇప్పుడీ సినిమా నుంచి ట్రయిలర్ వచ్చే టైమ్ వచ్చింది. తేజ సజ్జ నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

‘హను-మాన్’ ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ పోస్టర్ హీరో కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారు, అతని వెనుక భారీ హనుమాన్ విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్న ఈ ట్రైలర్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న.. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ సినిమాగా విడుదల కానుంది.

First Published:  13 Dec 2023 3:17 PM GMT
Next Story