Telugu Global
Cinema & Entertainment

Hanu-Man Movie | సంక్రాంతికి సిద్ధమైన హను-మాన్

Hanu-Man Movie - వాయిదాల మీద వాయిదాలు పడుతున్న హను-మాన్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తోంది.

Hanu-Man Movie | సంక్రాంతికి సిద్ధమైన హను-మాన్
X

ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సూపర్ మేన్ మూవీ 'హను-మాన్‌'. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా కోసం హై-ఎండ్ గ్రాఫిక్స్ వాడుతున్నారు. అందుకే సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఈసారి ఏకంగా సంక్రాంతి రిలీజ్ ప్రకటించారు.

హను-మాన్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. పోస్టర్ లో తేజ సజ్జా ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తున్నాడు. గణేశ్ పాత్రధారిని తన భుజాలపై మోసుకుంటూ వస్తుంటే, చుట్టూ భారీ గుంపుతో జనం అతడ్ని ఉత్సాహపరుస్తున్నారు.

హను-మాన్ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదలకానుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

"అంజనాద్రి" ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది హను-మాన్. ఓ సాధారణ వ్యక్తి, హనుమంతుడి ఆశీస్సులతో ఎలా బలవంతుడిగా మారాడు, ఆ తర్వాత అతడి ప్రాంతంలో జరిగిన మార్పులేంటి లాంటి అంశాల్ని ఇందులో చూపించారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు.

First Published:  18 Sep 2023 4:44 PM GMT
Next Story