Telugu Global
Cinema & Entertainment

HANU-MAN - షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్ మూవీ

HANU-MAN Movie - తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మూవీ హనుమాన్. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది.

HANU-MAN - షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్ మూవీ
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా హను-మాన్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేశారు.

ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ ను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా టీజర్‌కి యూట్యూబ్‌లో అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా హిట్టయింది.

హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

హను-మాన్ "అంజనాద్రి" అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. హీరో హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది సినిమా స్టోరీ. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.



First Published:  18 April 2023 2:42 AM GMT
Next Story