Telugu Global
Cinema & Entertainment

Hanu-Man - మళ్లీ వాయిదా పడిన హనుమాన్

Hanu-Man postpone - తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హను-మాన్ సినిమా మరోసారి వాయిదా పడింది. గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తికాలేదంట.

Hanu-Man - మళ్లీ వాయిదా పడిన హనుమాన్
X

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం 'హను-మాన్‌'. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని మొదట వేసవిలో మే 12న విడుదల చేయాలని భావించారు. అయితే, అది వాయిదా పడింది. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ చాలీసాకు కూడా మంచి స్పందన వచ్చింది. అలా పెరిగిన అంచనాల మధ్య, మరింత క్వాలిటీగా సినిమాను అందించాలంటే ఉద్దేశంతో విడుదల వాయిదా వేశారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ వర్క్ చేస్తున్నారు.

‘‘హనుమాన్‌’ టీజర్‌పై మీరు చూపించిన అపరిమితమైన ప్రేమ మా మనసుని హత్తుకుంది. దీంతో సినిమా విషయంలో మా పై బాధ్యత మరింత పెరిగింది. అందరూ కలిసి సెలబ్రేట్‌ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తామని మాటిస్తున్నాం. బిగ్ స్క్రీన్ పై ‘హనుమాన్‌’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం.. జై శ్రీరామ్ ’’అని చిత్ర యూనిట్ పేర్కొంది.

హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల కానుంది.

First Published:  6 May 2023 2:47 AM GMT
Next Story