Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | దూసుకుపోతున్న హనుమాన్

Hanu-Man Movie - హనుమాన్ మూవీ రోజురోజుకు మరింత పెద్దగా మారుతోంది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమాదే హవా.

Hanu-Man | దూసుకుపోతున్న హనుమాన్
X

హనుమాన్ 12 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ బయటకొచ్చాయి. ఈ ఇండియన్ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. పండుగ సెలవులు ముగిసిన తర్వాత కూడా హనుమంతుడు తన అద్భుతమైన బాక్సాఫీస్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మంచి పట్టు సాధిస్తోంది.

హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ 12 రోజుల్లో 58 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, అన్ని వెర్షన్లతో కలిపి ఈ సినిమా 113 కోట్ల రూపాయల షేర్ సాధించింది. కేవలం తెలుగు వెర్షన్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 90 కోట్ల వరకు ఉంటుంది

ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా 215 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ వారాంతంలో రూ. 250 కోట్ల మార్క్ కు చేరడానికి సిద్ధంగా ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా మరోసారి లాంగ్ వీకెండ్ రావడంతో.. హనుమాన్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

3వ వారం కూడా ఈ సినిమా కొనసాగితే అల వైకుంఠపురములో (260 కోట్ల గ్రాస్) ను ఇది కచ్చితంగా క్రాస్ చేస్తుంది. అదే కనుక జరిగితే.. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ గా నిలుస్తుంది హనుమాన్.

First Published:  25 Jan 2024 5:11 PM GMT
Next Story