Telugu Global
Cinema & Entertainment

త్రీడీలో 'హనుమాన్'

హనుమాన్ కు ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా త్రీడీ వెర్షన్ పనులు పూర్తిచేసి థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది.

త్రీడీలో హనుమాన్
X

సంక్రాంతి పండుగకు చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రికార్డు స్థాయి విజయం దిశగా హనుమాన్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా వెళ్తోంది. హనుమాన్ మూవీ విడుదలై 20 రోజులు గడిచినా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్, ఓవర్సీస్ లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్రీడీ వెర్షన్ లోకి మార్చి మళ్లీ విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాను త్రీడీలోకి మార్చే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మూవీలోని కొంత భాగాన్ని ఇప్పటికే త్రీడీలోకి మార్చి థియేటర్ లో ప్రదర్శించి చెక్ చేసుకున్నట్లు సమాచారం. హనుమాన్ కు ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా త్రీడీ వెర్షన్ పనులు పూర్తిచేసి థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది.

హనుమాన్ సినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా సన్నివేశాలు గ్రాఫిక్స్ ద్వారా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హనుమంతుడు ప్రత్యక్షమయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలను త్రీడీలోకి మారిస్తే ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందే అవకాశం ఉంది. హనుమాన్ మూవీ ని త్రీడీ వెర్షన్ లోకి మారిస్తే ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తి ప్రదర్శించే ఛాన్స్ ఉంది. దీని వల్ల కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

First Published:  31 Jan 2024 3:07 PM GMT
Next Story