Telugu Global
Cinema & Entertainment

Hanu-Man Movie | మరో రికార్డ్ సృష్టించిన హను-మాన్

Hanu-Man Movie - సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ మూవీ మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా 200 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది.

Hanu-Man Movie | మరో రికార్డ్ సృష్టించిన హను-మాన్
X

తేజ సజ్జా హీరోగా నటించిన ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ అన్ని ప్రాంతాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రం గ్రాండ్ గా సెకండ్ వీకెండ్ రన్ ని పూర్తి చేసుకొని 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఆడియన్స్ అంచనాలని మించిన ఈ చిత్రం ప్రతిరోజూ మంచి నెంబర్స్ తో బలమైన పట్టును సాధిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

లిమిటెడ్ రిలీజ్, మినిమమ్ టికెట్ ప్రైస్ అయినప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నార్త్ లో కూడా అద్భుతంగా దూసుకుపోతోంది.




First Published:  23 Jan 2024 5:07 PM GMT
Next Story