Telugu Global
Cinema & Entertainment

Hansika: సింగిల్ షాట్ లో సైకలాజికల్ థ్రిల్లర్

Hansika's New movie - హన్సిక నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హన్సిక మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు, సింగిల్ షాట్ లో తీసిన సినిమా ఇది.

Hansika: సింగిల్ షాట్ లో సైకలాజికల్ థ్రిల్లర్
X

వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ఓ సినిమా చేసింది. రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమా పేరు 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.

ప్రపంచం లోనే మొదటిసారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రాన్ని తీశారు.

ఆ హాలీవుడ్ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది.

ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం విశేషం. ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సీజీ వర్క్ యాడ్ చేయడం మరో ప్రత్యేకత. సింగిల్ షాట్ లో తీసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

First Published:  30 Jan 2023 4:45 PM GMT
Next Story