Telugu Global
Cinema & Entertainment

My Name is Sruthi | హన్సిక నుంచి మరో సినిమా

My Name is Sruthi - శృతిహాసన్ తాజా చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

My Name is Sruthi | హన్సిక నుంచి మరో సినిమా
X

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కోలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్. ప్రస్తుతం తమిళనాట ఫిమేల్ ఓరియంటెండ్ సినిమాలు చేస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో హన్సిక కూడా ఒకరు. ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అలాంటి ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేసింది.

హన్సిక నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పోరాటం పోరాటం అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.

కష్ణకాంత్ రచించిన ఈ పాటకు మార్కె కె రోబిన్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. ఇప్పటివరకు రానటువంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందంటున్నాడు దర్శకుడు. చివరివరకు ఎవరి ఊహకందని ట్విస్టులతో కథ సాగుతుందంట.

సినిమాలో శృతి అనే యువ‌తిగా కనిపించనుంది హన్సిక. త‌న భావాల్ని ధైర్యంగా వెల్ల‌డించే యువ‌తిగా కనిపించనుంది. ఆద్యంతం మ‌లుపుల‌తో ఆస‌క్తికరంగా సినిమా సాగుతుందని, క‌థ వింటున్న‌ప్పుడు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ ఉంటుందని చెబుతోంది హన్సిక.

ముర‌ళీశ‌ర్మ‌, ఆర్ నారేయ‌న‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, రాజీవ్ క‌న‌కాల ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ సినిమాటోగ్రాఫర్. చోటా.కె ప్రసాద్ ఎడిటర్. లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక నుంచి వస్తోంది మై నేమ్ ఈజ్ శృతి సినిమా. ఈ సినిమా సక్సెస్ తో మరోసారి టాలీవుడ్ లో పాపులర్ అవ్వాలని చూస్తోంది ఈ ఆపిల్ పిల్ల.

First Published:  29 Sept 2023 5:17 PM GMT
Next Story