Telugu Global
Cinema & Entertainment

Hansika: జైపూర్ లో హన్సిక పెళ్లి

ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికూతురు కాబోతోంది. తన వ్యాపార భాగస్వామి సోహైల్ ను జీవిత భాగస్వామిగా మార్చుకోబోతోంది. వచ్చే నెల్లోనే పెళ్లి.

Hansika: జైపూర్ లో హన్సిక పెళ్లి
X

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. కోలీవుడ్ ముద్దుగుమ్మ హన్సిక పెళ్లి చేసుకోబోతోంది. తన బిజినెస్ పార్టనర్ సోహైల్ నే ఈమె పెళ్లాడనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సోహైల్ తో కలిసి చాన్నాళ్ల కిందటే బిజినెస్ స్టార్ట్ చేసింది హన్సిక. ఇద్దరూ కలిసి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టారు. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడదే పెళ్లికి దారితీసింది.

డిసెంబర్ 4న హన్సిక-సోహైల్ పెళ్లి జరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా జైపూర్ లో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. సినీ ప్రముఖులకు దూరంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుంది.

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, ఆ తర్వాత కోలీవుడ్ లో సెటిలైంది. శింబుతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. వీళ్ల వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. అప్పట్నుంచి సింగిల్ గా ఉంటున్న హన్సిక.. ఇప్పుడు సోహైల్ తో పెళ్లికి సిద్ధమైంది.

First Published:  1 Nov 2022 3:15 PM GMT
Next Story