Telugu Global
Cinema & Entertainment

Hansika: బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ

Hansika Motwani Bachelorette party: మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న హన్సిక, తన ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. అందర్నీ గ్రీస్ కు తీసుకెళ్లింది.

Hansika: బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ
X

త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది హీరోయిన్ హన్సిక. తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతారియాను ఆమె వివాహం చేసుకుంటోంది. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది హన్సిక. అయితే అది ఇండియాలో కాదు.

తన బెస్ట్ ఫ్రెండ్స్ అందర్నీ గ్రీస్ తీసుకెళ్లింది ఈ బ్యూటీ. అక్కడే ఓ రిసార్ట్ లో వీళ్లంతా గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. బోట్ లో షికార్లు కొట్టారు. రెస్టారెంట్ లో సరదాగా లంచ్ చేశారు. గ్రీస్ రోడ్లపై చిందులు కూడా వేశారు.

ఇలా తన ఫ్రెండ్స్ కు కలకాలం గుర్తుండిపోయే పార్టీ ఇచ్చింది హన్సిక. మరోవైపు ఆమె పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జైపూర్ లోని ఓ రాజుల కోటలో హన్సిక-సోహైల్ పెళ్లి వేడుక 3 రోజుల పాటు గ్రాండ్ గా జరగనుంది.

నయనతార టైపులోనే హన్సిక కూడా తన పెళ్లి హక్కుల్ని ఓ ఓటీటీ సంస్థకు అమ్మేసింది. వాళ్లు తప్ప మరెవ్వరూ పెళ్లి వేడుకలో వీడియోలు, ఫొటోలు తీయడానికి వీల్లేదు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత హన్సిక మాత్రం కొన్ని ఫొటోల్ని షేర్ చేస్తుంది.



First Published:  27 Nov 2022 12:03 PM GMT
Next Story