Telugu Global
Cinema & Entertainment

గురు క్రెడిట్ మొత్తం దర్శకుడిదే - ఆది పినిశెట్టి

రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమాలో విలన్ గా నటించాడు ఆది పినిశెట్టి. ఇందులో గురు పాత్రలో అతడు కనిపించి మెప్పించాడు.

గురు క్రెడిట్ మొత్తం దర్శకుడిదే - ఆది పినిశెట్టి
X

ది వారియర్ సినిమాలో రామ్ కు ఎంత పేరొచ్చిందో, విలన్ గా నటించిన ఆది పినిశెట్టికి కూడా అంతే పేరొచ్చింది. గురు పాత్రలో కరడుగట్టిన రౌడీగా ఆది అతికినట్టు సరిపోయాడు. దాదాపు అన్ని సమీక్షల్లో ఆది పినిశెట్టిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు విమర్శకులు. దీనిపై ఆనందం వ్యక్తం చేశాడు ఆది. సినిమాలో గురు పాత్రకు సంబంధించిన క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడికే ఇచ్చాడు.

"నేను ఇంతకు ముందు కమర్షియల్ పెర్ఫార్మన్స్ చేయలేదు. నేను క్యారెక్టర్ ప్రకారం తీసుకుని, ఆ క్యారెక్టర్ లో ఉండి... సినిమాటిక్ కమర్షియల్ మీటర్ లో ఉన్నది గురు పాత్ర. ఈ సినిమాలో క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్ చేసే ప్రతి పనిని గురు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి చెప్పింది ఫాలో అయిపోయా. మేకప్, గెటప్ విషయంలో కొంత వర్క్ చేశారు. చెవికి దుద్దు పెట్టుకోవడంతో పాటు చిన్న లెన్స్ వాడాను. గురును డిఫరెంట్ గా చూపించడం కోసం నేను ఆ వర్క్ చేశాను. ఇది తప్ప మిగతా క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం లింగుస్వామిదే."

ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్ గా నటించడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆది పినిశెట్టి. క్యారెక్టర్ పెర్ ఫెక్ట్ గా ఉంటే హీరో అయినా, విలన్ అయినా, కామెడీ అయినా ఏదైనా చేయొచ్చని చెబుతున్నాడు. ఇక రామ్ తో సింక్ పై స్పందిస్తూ.. క్లైమాక్స్ లో తామిద్దరం ఫైట్ చేస్తుంటే.. సింక్ లో డాన్స్ చేసినట్టు ఉందని చాలామంది అన్నారట. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో చెప్పడానికి ఆ పోలిక సరిపోతుందన్నాడు ఆది.

First Published:  15 July 2022 2:00 PM GMT
Next Story