Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | అమెరికాలో కుర్చీ మడతపెట్టి...

Mahesh Babu's 'Kurchi Madatha Petti' song: గుంటూరుకారం సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ అమెరికాలో కూడా పాపులరైంది. ఏకంగా ఓ ఈవెంట్ లో ప్లే చేశారు.

Guntur Karam | అమెరికాలో కుర్చీ మడతపెట్టి...
X

గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కంటే, ఈ పాటే పెద్ద హిట్టు. రీమిక్స్ బీట్ కు మహేష్ బాబు, శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు పాటను బ్లాక్ బస్టర్ చేశాయి. విడుదలకు ముందే పెద్ద హిట్టయిన ఈ పాట, వీడియో సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మరింత వైరల్ గా మారింది.


విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ పాట ప్రపంచవ్యాప్తమైంది. కుర్చీ మడతపెట్టి పాటకు ఉన్న ఆదరణ కారణంగా దేశంలోని అనేక ఈవెంట్లలో దీన్ని ప్లే చేస్తున్నారు. ఈ పాట తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. వారు కూడా తమ పార్టీల్లో ఈ పాటను ప్లే చేయడం ప్రారంభించారు.


ఇప్పుడు, ఆశ్చర్యకరంగా, అమెరికా ఈవెంట్లలో కూడా ఈ పాట వినిపిస్తోంది. యూఎస్ఏలో జరిగిన ఎన్బీఏ మ్యాచ్ సందర్భంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ను ప్లే చేశారు. హూస్టన్‌లో జరిగిన మ్యాచ్ లో బ్రేక్ టైమ్ లో ఈ పాట ప్లే చేసి ప్రేక్షకుల్లో హుషారు తెప్పించారు.


మొన్నటివరకు విదేశాల్లో ఇండియన్ సాంగ్ అంటే నాటు-నాటు మాత్రమే. చాలా దేశాల్లో ఆ పాటను ప్లే చేశారు. విదేశీయులు రీల్స్ కూడా చేశారు. ఆ పాట తర్వాత, మళ్లీ అ స్థాయిలో సక్సెస్ అయిన సాంగ్ కుర్చీ మడతపెట్టి. యూట్యూబ్‌లో దేశవ్యాప్తంగా 150 మిలియన్ల వ్యూస్ పొందింది ఈ సాంగ్. మహేష్ మాస్ అప్పీల్ కు కేరాఫ్ గా నిలిచిన ఈ సాంగ్ ను తమన్ కంపోజ్ చేశాడు.


మహేష్ సూచన మేరకు సినిమాలో ఆఖరి నిమిషంలో ఈ పాటను చేర్చారు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది.



First Published:  2 April 2024 2:09 AM GMT
Next Story