Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | భారీగా పడిపోయిన మహేష్ మూవీ

Guntur Kaaram - మహేష్ హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రెండో రోజు ఈ సినిమా అనూహ్యంగా పడిపోయింది.

Guntur Kaaram | భారీగా పడిపోయిన మహేష్ మూవీ
X

సినిమా ఫలితాలన్నీ సోషల్ మీడియా మీద ఆధారపడిన రోజులివి. హిట్టయిన సినిమా గట్టిగా 2 వారాలు ఆడుతుంది. ఇక ఫ్లాప్ టాక్ వస్తే మరుసటి రోజుకే ఖాళీ. మహేష్ బాబు సినిమా కూడా దీనికి అతీతం కాదు. ఇదంతా గుంటూరుకారం సినిమా మేటర్.

ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోల నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది. ఎప్పుడైతే మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చిందో, రెండో రోజుకు చాలా షోలు కాన్సిల్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రద్దయ్యాయి.

సినిమా డ్రాప్ అయిన విషయం కలెక్షన్లలో క్లియర్ గా తెలుస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 94 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, రెండో రోజు ఆ వసూళ్లు 33 కోట్లకు పడిపోయాయి. అంతే, మూడొంతులు డ్రాప్ అయిందన్నమాట. మహేష్ సినిమా ఎప్పుడూ ఇలా రెండో రోజుకే పడిపోయిన దాఖలాల్లేవ్.

ఇప్పటికే సినిమాకు నెగెటివ్ టాక్ బాగా వచ్చేసింది. దీంతో సంక్రాంతి తర్వాత ఈ సినిమా పరిస్థితేంటనేది డిస్ట్రిబ్యూటర్లకు అర్థం కావడం లేదు. మరోవైపు పెంచిన టికెట్ రేట్లను మరో 2 రోజుల్లో తగ్గించేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అప్పుడైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనేది ఓ ఆలోచన.

First Published:  14 Jan 2024 3:59 PM GMT
Next Story