Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీ నుంచి మరో సాంగ్

Guntur Kaaram Song - గుంటూరు కారం నుంచి మరో సాంగ్ రాబోతోంది. రెండో పాటను వచ్చే వారమే రిలీజ్ చేయబోతున్నారు.

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
X

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో 13 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా పాటల ప్రచారం ఇప్పటికే షురూ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లిరికల్ సాంగ్ గా దమ్ మసాలా అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ వెల్లడించాడు. గుంటూరు కారం రెండో పాటను వచ్చే వారంలోనే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి పోస్టర్లు సిద్ధం చేశారు.

మహేష్-శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది గుంటూరు కారం సినిమా. ఇందులో ఫుల్ లెంగ్త్ సాంగ్స్ 4 ఉంటాయంట. మరో 2 బిట్ సాంగ్స్ ఉంటాయట. ఈ ఫుల్ లెంగ్త్ సాంగ్స్ లో ఒక పాటను ఆల్రెడీ విడుదల చేశారు. మిగిలిన 3 పాటల్లో ఒక పాటను వచ్చే వారం విడుదల చేయబోతున్నారు.

మిగతా 2 పాటల్ని కూడా మినిమం గ్యాప్స్ విడుదల చేసి, డిసెంబర్ రెండో వారానికి గుంటూరు కారం ట్రయిలర్ ను మార్కెట్లోకి తీసుకురావాలనేది ప్లాన్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది గుంటూరు కారం మూవీ.

First Published:  20 Nov 2023 4:52 PM GMT
Next Story