Telugu Global
Cinema & Entertainment

Neelima Guna Wedding: ఘనంగా గుణశేఖర్ కుమార్తె పెళ్లి

Neelima Guna wedding: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ పెళ్లి రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.

Neelima Guna Wedding: ఘనంగా గుణశేఖర్ కుమార్తె పెళ్లి
X

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన కూతురుకు పెళ్లి చేశాడు. గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ గుణ నిన్న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సమంతతో శాకుంతలం సినిమాను నిర్మిస్తున్నారీమె.

నిన్న రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ గుణ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. విద్యావేత్త‌, వ్యాపార‌వేత్త‌, ఎంట‌ర్ ప్రెన్యూర‌ర్, శ్రీ శ‌క్తి గ్రూప్ అధినేత‌, హైద‌రాబాద్ వాస్త‌వ్యులు అయిన డా.రామ‌కృష్ణ పింజ‌ల‌, శ్రీమ‌తి స‌త్య పింజ‌ల కుమారుడు ర‌వి ప్ర‌ఖ్యాతో, నీలిమ గుణ పెళ్లి జరిగింది.

తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ లో ఆర్భాటంగా జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి ఈ వేడుకకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు గుణశేఖర్. చిరంజీవి లాంటి ఎంతోమంది స్టార్ హీరోలను డైరక్ట్ చేశారు. ప్రస్తుతం సమంత లీడ్ రోల్ లో శాకుంతలం అనే మైథలాజికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ కుమార్తె, కొత్త పెళ్లికూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.








First Published:  3 Dec 2022 3:11 AM GMT
Next Story