Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam - శకుంతల కోసం నిజమైన వజ్రాలు, బంగారం

Shaakuntalam Movie - సమంత లీడ్ రోల్ లో వస్తోంది శాకుంతలం సినిమా. ఈ సినిమా కోసం అసలైన బంగారాన్ని, సిసలైన వజ్రాల్ని వాడాడు దర్శకుడు.

Shaakuntalam - శకుంతల కోసం నిజమైన వజ్రాలు, బంగారం
X

గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణశేఖ‌ర్‌.

శ్రీ వెంకటేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.

ఈ సినిమాలో స‌మంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. అలాగే ప్రతి పాత్రను ఎంతో గొప్పగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు మేక‌ర్స్‌. వీటి కోసం ఏం చేశారు.. ఎలాంటి రీసెర్చ్ జ‌రిగింది వంటి విష‌యాల‌ను దర్శకుడు వివరించాడు.

"నిజమైన బంగారం వాడాం శాకుంతలంలో. ఇలాంటి ప్రయత్నం మొదటిసారి నందమూరి తారక రామారావు దానవీరశూరకర్ణలో చేశారు. ఆయన మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఇలాంటి మైథలాజికల్‌ మూవీస్‌కి ఆయనే మూలకారకుడు. వసుంధర జువెలర్స్ మాతో అసోసియేట్‌ అవుతుందంటే ఆనందంగా అనిపించింది. నీలిమ వాళ్లను తీసుకొచ్చింది. వాళ్లకి కూడా టేస్ట్ ఉండటం వల్ల ఇమీడియేట్‌గా వచ్చారు. ఇలాంటివారందరినీ శాకుంతల ప్రాజెక్ట్ అట్రాక్ట్ చేసింది. దాదాపు 14 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు వాడాం. బంగారం మాత్రమే కాదు, నిజమైన వజ్రాలు వాడాం."

ఈ సినిమా నుంచి దేవ్‌మోహన్‌ లుక్‌, సమంత లుక్‌ ఇప్పటికే బయటకొచ్చాయి. అందులో వాళ్లు ధరించినవి నిజమైన నగలు. ఇంతకుముందు రుద్రమదేవి సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు దర్శకుడు గుణశేఖర్.







First Published:  24 March 2023 8:37 AM GMT
Next Story