Telugu Global
Cinema & Entertainment

Ramabanam - సమ్మర్ ఎట్రాక్షన్ గా గోపీచంద్ సినిమా

Gopichand's Ramabanam movie - రామబాణం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతోంది.

Ramabanam - సమ్మర్ ఎట్రాక్షన్ గా గోపీచంద్ సినిమా
X

గోపీచంద్ కొత్త సినిమా రామబాణం, శ్రీవాస్‌ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలు చేశాడు. రామబాణం వీళ్లకి మూడో సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 5న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ, ఓ పోస్టర్ విడుదల చేశారు. గోపీచంద్ పవర్ ఫుల్ లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు.

ఈ చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే 'రామబాణం'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, 'విక్కీస్ ఫస్ట్ యారో' అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లో 30వ చిత్రం ఇది. ఈ సినిమాకి భూపతి రాజా కథ అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.




First Published:  5 March 2023 7:18 AM GMT
Next Story