Telugu Global
Cinema & Entertainment

Gopichand: కన్నడ దర్శకుడితో గోపీచంద్ సినిమా

Gopichand Upcoming movie: గోపీచంద్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. కన్నడ దర్శకుడిని తెలుగుకు పరిచయం చేస్తున్నాడు.

Gopichand: కన్నడ దర్శకుడితో గోపీచంద్ సినిమా
X

హీరో గోపీచంద్ తన 31వ చిత్రం కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేతులు కలిపాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమాలు ఈరోజు లాంఛనంగా జరిగాయి. ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. కుదిరితే ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హర్ష, భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. గోపీచంద్ ఇంతకు ముందు యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందంటోంది యూనిట్.

ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 March 2023 3:44 PM GMT
Next Story