Telugu Global
Cinema & Entertainment

Viswam Movie | గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Viswam Movie - శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ పెట్టారు. గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Viswam Movie | గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే
X

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంజాన్ సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు విశ్వం అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం , రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకతో గ్లింప్స్ మొదలైంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ చంపేస్తాడు. చివరిగా బిర్యానీ తింటూ డైలాగ్ చెబుతాడు. తినే ప్రతి మెతుకు మీద.. అనే పాత డైలాగ్ అది.

లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకునిస్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని గ్లింప్స్ లో నెగెటివ్‌ షేడ్‌లో చూపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతను డైలాగ్ పలికిన విధానం విలన్ ఛాయల్ని చూపిస్తోంది.

శ్రీను వైట్ల తన మార్క్ కు తగ్గట్టు ఈ గ్లింప్స్ ను స్టయిలిష్ గా తీర్చిదిద్దాడు. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించడంతో అతడు సక్సెస్ అయ్యాడు. కేవీ గుహన్‌ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడిస్తారు. గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ కలిసి ఈ సినిమాకు కథ రాయడం విశేషం.

First Published:  11 April 2024 4:30 PM GMT
Next Story