Telugu Global
Cinema & Entertainment

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఖరారు అయింది. స్వయంగా ప్రొడ్యూసర్ ఈ సినిమా టైటిల్ ని లీక్ చేయడం కొసమెరుపు.

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్
X

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇన్నాళ్లూ టైటిల్ లేకుండానే షూటింగ్ చేశారు. తాజాగా టైటిల్ లాక్ చేశారు.


గోపీచంద్ చేస్తున్న ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజానికి గోపీచంద్-శ్రీవాస్ మూవీ అనగానే.. లౌక్యం, సౌఖ్యం టైపులో టైటిల్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ పెట్టారు.


ఈ టైటిల్ ను కూడా అనుకోకుండా బయటపెట్టారు నిర్మాత. ధమాకా సినిమా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తన అప్ కమింగ్ మూవీ రామబాణం కూడా వస్తోందంటూ నోరుజారారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. వెంటనే మీడియా దాన్ని అందుకుంది. దీంతో గోపీచంద్ కొత్త సినిమాకు రామబాణం అనే టైటిల్ పెట్టామంటూ కన్ ఫర్మ్ చేశారు నిర్మాత.


ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ముందుగా రాజశేఖర్ ను అనుకున్నారు. కానీ చాన్నాళ్లు నాన్చిన తర్వాత రాజశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, ఆ స్థానంలో జగపతిబాబును తీసుకున్నారు. ధమాకా హంగామా ముగిసిన వెంటనే రామబాణం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.

First Published:  27 Dec 2022 11:05 AM GMT
Next Story