Telugu Global
Cinema & Entertainment

Bhimaa | రౌడీలపై సవారీ చేసే భీమా

Bhimaa Movie -కన్నడ దర్శకుడితో కలిసి భీమా అనే సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా నుంచి మరో లుక్ రిలీజ్ చేశారు.

Bhimaa | రౌడీలపై సవారీ చేసే భీమా
X

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భీమా'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రచారాన్ని దశలవారీగా చేస్తున్నారు. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ హై-బడ్జెట్ చిత్రం నుంచి గోపీచంద్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఖాకీ దుస్తుల్లో షేడ్స్‌తో కనిపించాడు గోపీచంద్. పోలీసు జీపు బానెట్‌పై కూర్చున్న గోపీచంద్ గూండాలను తాళ్లతో లాగుతున్నాడు.

గోపీచంద్ కు పోలీస్ యూనిఫామ్ కొత్తకాదు. గతంలో ఇలాంటి పాత్రలు చాలానే చేశాడు. అయితే ఈసారి అతడి పాత్ర మరింత భిన్నంగా ఉంటుందంటున్నాడు దర్శకుడు హర్ష. ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన మ్యాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల పనిచేస్తున్నారు.

కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ హై యాక్షన్ ఎఁటర్ టైనర్ కు రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కంపోజ్ చేస్తున్నారు.
First Published:  14 Nov 2023 3:35 PM GMT
Next Story