Telugu Global
Cinema & Entertainment

Bhimaa | గోపీచంద్ భీమా ట్రయిలర్ రివ్యూ

Bhimaa Movie - గోపీచంద్ నుంచి మరో సినిమా రెడీ అయింది. భీమా మూవీ ట్రయిలర్ రిలీజైంది.

Bhimaa | గోపీచంద్ భీమా ట్రయిలర్ రివ్యూ
X

హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు అన్ని వైపులా నుంచి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ ఓపెన్ అవుతుంది. శ్రీమహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు 6వ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు. ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా అద్భుతంగా పరిచయం చేశారు.

కన్నడలో స్టార్ దర్శకుడైన హర్ష, ప్రస్తుత ట్రెండ్ కు తగ్గ కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆధ్యాత్మికతో పాటు, ఇతర లేయర్స్ ని సమతూకంలో ప్రజెంట్ చేశాడు. గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేశారు. అతను కనికరం లేని పోలీసుగా కనిపిస్తుండగా, మరో అవతార్ చాలా టెర్రిఫిక్ గా ఉంది.

గోపీచంద్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా... హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మకు మంచి పాత్రలు దక్కినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది 'భీమా' చిత్రం.

First Published:  24 Feb 2024 4:26 PM GMT
Next Story