Telugu Global
Cinema & Entertainment

Gopichand | భీమా మూవీ షూటింగ్ అప్ డేట్స్

Gopichand - ప్రస్తుతం భీమా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఈ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Gopichand | భీమా మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భీమా'. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ తాజాగా మంగుళూరులో మొదలైంది.

మంగళూరులోని దట్టమైన అడవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో, గోపీచంద్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.

మాస్‌, యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు కూడా ఉంటాయంటున్నారు మేకర్స్. సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. రామబాణం సినిమాతో అతడి కథల ఎంపికపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో భీమా సినిమాతో నిరూపించుకునే స్థితికి చేరాడు ఈ హీరో.

First Published:  25 Dec 2023 10:07 AM GMT
Next Story