Telugu Global
Cinema & Entertainment

Bhimaa Movie | పరీక్షలు అయిపోయాయి, భీమా చూడండి

Bhimaa Movie - భీమా సినిమా ఫ్లాప్ అయింది. అయినా గోపీచంద్ తన ప్రచారం ఆపలేదు. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చాడు.

Bhimaa Movie | పరీక్షలు అయిపోయాయి, భీమా చూడండి
X

హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'భీమా'. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.

మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మేకర్స్ మాత్రం తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి పెద్ద ఈవెంట్ పెట్టారు. దర్శకులు మారుతి, సంపత్ నంది లాంటి వాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హీరో గోపీచంద్, భీమా సినిమాను చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి కాబట్టి, ఇకనైనా థియేటర్లకు వచ్చి తన సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు.

"సినిమాకి చాలా మంచి ప్రసంశలు వచ్చాయి. సినిమా చాలా బావుంది. 2 క్యారెక్టర్స్ లో చక్కని వేరియేషన్స్ చూపించారని అంతా అంటున్నారు. ఇంకా చూడని వారంతా థియేటర్స్ కి వెళ్లి చూడండి. గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాధామోహన్ కి, శ్రీధర్ కి ధన్యవాదాలు. పరీక్షలు అయిపోయాయి. ఇంకా చూడనికి ప్రేక్షకులు తప్పకుండా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు."

భీమా సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. ప్రస్తుతం థియేటర్లలో సినిమా కొనసాగుతున్నప్పటికీ, ఆక్యుపెన్సీ మాత్రం కనిపించడం లేదు. పరీక్షలు అయిపోవడంతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు ఇలా కెమెరాల ముందుకొచ్చాడు గోపీచంద్.

First Published:  16 March 2024 7:31 AM GMT
Next Story