Telugu Global
Cinema & Entertainment

Gopichand | ఇటలీలో ప్రారంభమైన గోపీచంద్ సినిమా

Gopichand Srinu Vaitla - గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. వీళ్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటలీలో మొదలైంది.

Gopichand | ఇటలీలో ప్రారంభమైన గోపీచంద్ సినిమా
X

'మాచో స్టార్' గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రీసెంట్ గా ఓ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చిత్రాలయం స్టుడియోస్ బ్యానర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తీయబోతున్నాడు.

భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ఇటలీలో ప్రారంభమైంది. ఇటలీ, మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించి శ్రీనువైట్ల ఆల్రెడీ లొకేషన్స్ రెక్కీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్ వాల్యూస్ తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ఇది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

ఈ సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. శ్రీనువైట్లతో పలు బ్లాక్‌బస్టర్స్‌ కు వర్క్ చేసిన గోపీ మోహన్, ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశాడు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇతర టెక్నికల్ టీమ్‌ తో పాటు, హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

కొన్నేళ్లుగా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాడు శ్రీనువైట్ల. అతడు తీసిన సినిమాలేవీ సక్సెస్ అవ్వలేదు. దీనికితోడు మంచు విష్ణుతో ప్రకటించిన సినిమా కూడా దాదాపు ఆగిపోయినట్టు కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో శ్రీనువైట్లకు అవకాశం ఇచ్చాడు గోపీచంద్. అటు ఈ హీరోకు కూడా సరైన సక్సెస్ పడలేదు. రీసెంట్ గా వచ్చిన రామబాణం సినిమా, అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సో.. ఈ కొత్త సినిమాపై ఇటు గోపీచంద్, అటు శ్రీనువైట్ల ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

First Published:  6 Oct 2023 1:18 AM GMT
Next Story