Telugu Global
Cinema & Entertainment

Gopichand: రామబాణం టైటిల్ విడుదల

Ramabanam: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఖరారు చేసారు. ఈ మూవీ కి రామబాణం అనే పేరు పెట్టారు

Gopichand: రామబాణం టైటిల్ విడుదల
X

సంక్రాంతి సందర్భంగా గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు పీపుల్ మీడియా సంస్థ నిర్మాతలు.


రీసెంట్ గా గోపీచంద్, ప్రభాస్ ను పెట్టి అన్ స్టాపబుల్-2 కోసం ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ను స్వయంగా బాలకృష్ణ బయటపెట్టారు. అలా సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈరోజు ఆ వీడియో క్లిప్ ను రిలీజ్ చేస్తూ, రామబాణం అనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


అంతా బాగుంది ఇదేదో బాలయ్య చేతుల మీదుగా రిలీజైంది అనే బిల్డప్ ఇవ్వడం మాత్రం బాగోలేదు. ఎందుకంటే, రామబాణం అనే టైటిల్ ఎప్పుడో బయటకొచ్చేసింది. మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చేశాయి. అంతెందుకు, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ టైటిల్ చెప్పేశారు.


ఇదంతా జరిగిన తర్వాత బాలయ్య తన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో రామబాణం టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. అదే బ్రేకింగ్ అన్నట్టు, నిర్మాతలు ఆ వీడియోతో ప్రచారం మొదలుపెట్టారు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రామబాణం సినిమా.

First Published:  14 Jan 2023 10:11 AM GMT
Next Story