Telugu Global
Cinema & Entertainment

Gopichand - కాంబినేషన్ నమ్మి సినిమా చేయలేదు

Gopichand - హిట్ కాంబినేషన్ ను నమ్మనంటున్నాడు గోపీచంద్. కంటెంట్ బాగుంటనే సినిమా హిట్ అవుతుందని చెబుతున్నాడు.

Gopichand - కాంబినేషన్ నమ్మి సినిమా చేయలేదు
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది రామబాణం సినిమా. గోపీచంద్-శ్రీవాస్ సూపర్ హిట్ కాంబోలో ఈ సినిమా వస్తోంది. అయితే ఈ కాంబినేషన్ పై కాస్త నెగెటివ్ ట్రోలింగ్ కూడా నడుస్తోంది. హిట్ కోసం గోపీచంద్ ఇలా కాంబినేషన్ ను నమ్ముకున్నాడనే ప్రచారం నడుస్తోంది. దీన్ని గోపీచంద్ ఖండించాడు. అంతేకాదు, తిరుగులేని కౌంటర్ కూడా ఇచ్చాడు.

"నేను కాంబోలు నమ్మను. హిట్ కాంబినేషన్ ని నమ్మి ఉంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటాను. లక్ష్యం కి, లౌక్యం కి ఏడేళ్లు గ్యాప్. అలాగే ఇప్పుడు రామబాణం కి ఏడేళ్లు గ్యాప్. మధ్యలో ఒకసారి వాసు చేద్దామన్నాడు కానీ నేనే వద్దన్నాను. మన కాంబోలో రెండు హిట్లు వచ్చాయి. మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలి అన్నాను. అలాంటి సినిమానే రామబాణం. ఇందులో ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి."

ఇలా విమర్శలకు తనదైన స్టయిల్ లో కౌంటర్ ఇచ్చాడు గోపీచంద్. అంతేకాకుండా.. ఇలాంటి కామెంట్స్ వస్తాయనే అనుమానంతోనే ఈ ప్రాజెక్టుకు లక్ష్యం-2 అనే టైటిల్ పెట్టలేదన్నాడు. హిట్ సినిమాను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం తమకు ఏ కోశానా లేదని స్పష్టం చేసిన గోపీచంద్.. సెంటిమెంట్ అంటగడతారనే ఉద్దేశంతో రెండక్షరాల టైటిల్ ను కూడా పెట్టలేదని అన్నాడు.

ఓ సందర్భంలో తన సినిమా స్టోరీని బాలయ్యకు వినిపించాడట గోపీచంద్. మంచి టైటిల్ కోసం వెదుకుతున్నామని కూడా చెప్పాడట. వెంటనే బాలకృష్ణ ఆసువుగా రామబాణం అనే పదాన్ని చెప్పాడట. దీంతో అదే టైటిల్ ను సినిమాకు పెట్టామన్నాడు గోపీచంద్.

First Published:  4 May 2023 12:20 PM GMT
Next Story